10, జులై 2009, శుక్రవారం

ఈ తెలుగు పదాలకు ఇంగ్లీష్ లో సమానమైన మాట దొరక లేదు

ఇది అధ్బుతమైన తెలుగు; దీనికి సాటి అయిన భాష ఇంకొక్కటి లేదు. అందుకే దీన్ని ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అన్నారు.
ఈ క్రింది తెలుగు పదాలకు ఇంగ్లీష్ లో సమానమైన మాట దొరక లేదు. ఎవరికైనా తెలిస్తే ఇందులో రాయండి
(1 ) ఎంగిలి చెయ్యి, (౨) గోరు ముద్ద, (౩) ఎత్తిపెట్టుకొని తాగడం (౪)పసలమ్మ పండుగ (౫) బాప్ప (6) పయ్యడ (౭) పెళ్లి చూపులు (౮) పూలు పళ్ళు (౯) బట్టలు పెట్టడం (౧౦) సమర్త కార్యం (౧౧) ఏనాలు (౧౨) కాల గోళ్ళ సంబరం (౧౩) పందిరికోలు పట్టిమంచం (౧౪) మడత మంచం (౧౫) నులక మంచం (౧౬) బొంకులు (౧౭) పరేచకాలు (౧౮) వెటకారం...

19, జూన్ 2009, శుక్రవారం

మృగాలం మేం మగాళ్ళం

మృగాలం
మేం మగాళ్ళం

మగాళ్ళం
మేం చీము నేత్తుర్లేని మగాళ్ళం
నిన్ను నానా పరుగులు తీయిస్తున్న
మృగాలం
స్నిగ్ద సౌందర్య జీవశక్తి, మన మాతృ మూర్తి
కష్టాల కడలి ని ఇష్టంగా తాగి
వుప్పేనలా పొంగిన కన్నీళ్ళకు
ఒకింత ఆనవాలు కూడా మిగల్చక
మనకు అస్తిత్వాన్నిచ్చిన ఈ ప్రశాంతి సుగాత్రి

తన అస్థిత్వము కోసం
మానాన్ని, ప్రాణాన్ని గొంతు గుప్పెట్లో పెట్టుకొని
ఎక్కని చార్మినార్ లేదు
దిగని కాలేజీ లేదు
ఆమె ప్రేమకై కట్టిన తాజామహల్లు
విశ్వ క్షేమానికి కట్టిన చార్మినార్లు
నెత్తుటితో పిక్కటిల్లుతున్నాయ్
కాలేజీలన్నీ ఆసిడ్ బోటిల్లతో పళ్ళు కోరుకుతున్నాయ్
మేము చీము నెత్తురులోకి
నిన్ను తోసేస్తున్న వేట కోడవళ్ళం
గ్యాస్ సిలన్ద్రల్లం
కిరోసిన్ డబ్బాలం
మేం చీము నేత్తుర్లేని మగాళ్ళం

బ్రతుకునిచ్చిన నీకు బ్రతుక్కోసం
నిన్ను వన్యప్రానిలా
గ్రుక్క తిప్పని నానా పరుగులు తీయిస్తున్న
మృగాలం

(డాక్టర్ అప్పలయ్య మీసాల కవిత్వం- ఈ కవిత
సమీర, స్వాప్నిక, ప్రనీత, శ్రేలక్ష్మి లకు
అంకితం)

కర్మించని క్షణాలు

కర్మించని క్షణాలు

క్షణాల రాళ్ల వినిర్మిత
పిరమిడ్ సందోహం ఈ ప్రపంచము
వృధా అయిన ప్రతీ క్షణ కణం
అగాధాల్లోకి తోసివేయబడ్డ
అతి శక్తివంతమైన ప్రభంజనం

ఆవిరైపోయే ఆలోచల్ని కార్యాల్లో పొదిగితే
సిద్ధులయి, కార్యసిద్దులై, బుద్ధులై, ఉత్ క్రిస్తులయి
తరాల అంబరాలని తాకే
కీర్తి హర్మ్యాలై
జీవనామ్రిత భాణ్దాలై
శక్తి భాండా గారాలై
కార్యచేతన ప్రభాకరులై
బ్రతుకు థారిని చూపే
జ్ఞాన దీపాలై
రాజులు నిష్క్రమించని కోటలై
మిగుల్తై !

పోయిన ప్రతీ క్షణము
మహానీయతా మృత భాన్దానికి పడ్డ
చిల్లులై, వృద్దిని మ్రింగే వైకుంఠ పాళీ పాములై
చెదల చీకట్లలో
పీకపిసుక్కున్న పిండాలై
ఝాన్ఝామారుతంలో తన్నివేయబడ్డ
శిశిర కాలపు ఆకులై
వచ్చికుడా చచ్చిపోయిన హీరోలవుతాయ్!


ఆలోచనలు కేవలం ఆలోచనలు
కార్యంతో కలువని మంద భాగ్యులు
తోలు గుడ్లు అవి
రైతుల కడుపు కొట్టే పొల్లు గింజలు అవి

యుగయుగాల చీకట్లలో
విచ్చన్నమైన పిండాలు అవి

ఎప్పటికి ఎవ్వరికి తలపుకు రాని
సామాన్యత్వపు ఇసుక రేనువులు అవి
'కర్మించని' క్షణాలు
కాలం ఏనుగు విసర్జించిన ఫలాలు

శ్రమించడమే నీ జీవనం

శ్రమించడమే నీ జీవనం


ఆత్రుతగా అధినాయకున్ని
అడుగులో అడుగై అనుసరిస్తూ
అహర్నిషల్నీ పరుగల పాఠాలతో నింపి, నీ ముందున్న నీ సోదరుడు వేసే
అడుగడుగు నీ ఆజ్జ్ఞయై, జవదాటని రాముడవైనపుడు
ఎన్ని సముద్రాలు నీ చెమటల
పరవల్లకు నిష్చీస్తులయ్యాయో తెలుసా!

ఎన్ని ట్యాంకర్ల ఫ్యుయళ్ళని నింపుకున్నా వో నా ముద్దుల చీమా?

గ్రుక్క తిప్పుకోవడం నీ వెరుగవ్!
వీధి చివర బాతాకానీ కొట్టడం కూడా తెలియని అమాయకుడవ్!

శ్రమించడమే నీ జీవనం
విశ్రమించడం నీలో లేని గుణం

నీ నడకా, నీ పరుగు
నీ ఖజానాల్ని నింపే మంత్రాలు
నిన్ను చూసి స్పందించని మిడుతలు
పదోతరగతి పది సార్లు ఫేయి లయ్యే బడుద్ధాయిలు