19, జూన్ 2009, శుక్రవారం

శ్రమించడమే నీ జీవనం

శ్రమించడమే నీ జీవనం


ఆత్రుతగా అధినాయకున్ని
అడుగులో అడుగై అనుసరిస్తూ
అహర్నిషల్నీ పరుగల పాఠాలతో నింపి, నీ ముందున్న నీ సోదరుడు వేసే
అడుగడుగు నీ ఆజ్జ్ఞయై, జవదాటని రాముడవైనపుడు
ఎన్ని సముద్రాలు నీ చెమటల
పరవల్లకు నిష్చీస్తులయ్యాయో తెలుసా!

ఎన్ని ట్యాంకర్ల ఫ్యుయళ్ళని నింపుకున్నా వో నా ముద్దుల చీమా?

గ్రుక్క తిప్పుకోవడం నీ వెరుగవ్!
వీధి చివర బాతాకానీ కొట్టడం కూడా తెలియని అమాయకుడవ్!

శ్రమించడమే నీ జీవనం
విశ్రమించడం నీలో లేని గుణం

నీ నడకా, నీ పరుగు
నీ ఖజానాల్ని నింపే మంత్రాలు
నిన్ను చూసి స్పందించని మిడుతలు
పదోతరగతి పది సార్లు ఫేయి లయ్యే బడుద్ధాయిలు

1 కామెంట్‌: