19, జూన్ 2009, శుక్రవారం

కర్మించని క్షణాలు

కర్మించని క్షణాలు

క్షణాల రాళ్ల వినిర్మిత
పిరమిడ్ సందోహం ఈ ప్రపంచము
వృధా అయిన ప్రతీ క్షణ కణం
అగాధాల్లోకి తోసివేయబడ్డ
అతి శక్తివంతమైన ప్రభంజనం

ఆవిరైపోయే ఆలోచల్ని కార్యాల్లో పొదిగితే
సిద్ధులయి, కార్యసిద్దులై, బుద్ధులై, ఉత్ క్రిస్తులయి
తరాల అంబరాలని తాకే
కీర్తి హర్మ్యాలై
జీవనామ్రిత భాణ్దాలై
శక్తి భాండా గారాలై
కార్యచేతన ప్రభాకరులై
బ్రతుకు థారిని చూపే
జ్ఞాన దీపాలై
రాజులు నిష్క్రమించని కోటలై
మిగుల్తై !

పోయిన ప్రతీ క్షణము
మహానీయతా మృత భాన్దానికి పడ్డ
చిల్లులై, వృద్దిని మ్రింగే వైకుంఠ పాళీ పాములై
చెదల చీకట్లలో
పీకపిసుక్కున్న పిండాలై
ఝాన్ఝామారుతంలో తన్నివేయబడ్డ
శిశిర కాలపు ఆకులై
వచ్చికుడా చచ్చిపోయిన హీరోలవుతాయ్!


ఆలోచనలు కేవలం ఆలోచనలు
కార్యంతో కలువని మంద భాగ్యులు
తోలు గుడ్లు అవి
రైతుల కడుపు కొట్టే పొల్లు గింజలు అవి

యుగయుగాల చీకట్లలో
విచ్చన్నమైన పిండాలు అవి

ఎప్పటికి ఎవ్వరికి తలపుకు రాని
సామాన్యత్వపు ఇసుక రేనువులు అవి
'కర్మించని' క్షణాలు
కాలం ఏనుగు విసర్జించిన ఫలాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి