19, జూన్ 2009, శుక్రవారం

మృగాలం మేం మగాళ్ళం

మృగాలం
మేం మగాళ్ళం

మగాళ్ళం
మేం చీము నేత్తుర్లేని మగాళ్ళం
నిన్ను నానా పరుగులు తీయిస్తున్న
మృగాలం
స్నిగ్ద సౌందర్య జీవశక్తి, మన మాతృ మూర్తి
కష్టాల కడలి ని ఇష్టంగా తాగి
వుప్పేనలా పొంగిన కన్నీళ్ళకు
ఒకింత ఆనవాలు కూడా మిగల్చక
మనకు అస్తిత్వాన్నిచ్చిన ఈ ప్రశాంతి సుగాత్రి

తన అస్థిత్వము కోసం
మానాన్ని, ప్రాణాన్ని గొంతు గుప్పెట్లో పెట్టుకొని
ఎక్కని చార్మినార్ లేదు
దిగని కాలేజీ లేదు
ఆమె ప్రేమకై కట్టిన తాజామహల్లు
విశ్వ క్షేమానికి కట్టిన చార్మినార్లు
నెత్తుటితో పిక్కటిల్లుతున్నాయ్
కాలేజీలన్నీ ఆసిడ్ బోటిల్లతో పళ్ళు కోరుకుతున్నాయ్
మేము చీము నెత్తురులోకి
నిన్ను తోసేస్తున్న వేట కోడవళ్ళం
గ్యాస్ సిలన్ద్రల్లం
కిరోసిన్ డబ్బాలం
మేం చీము నేత్తుర్లేని మగాళ్ళం

బ్రతుకునిచ్చిన నీకు బ్రతుక్కోసం
నిన్ను వన్యప్రానిలా
గ్రుక్క తిప్పని నానా పరుగులు తీయిస్తున్న
మృగాలం

(డాక్టర్ అప్పలయ్య మీసాల కవిత్వం- ఈ కవిత
సమీర, స్వాప్నిక, ప్రనీత, శ్రేలక్ష్మి లకు
అంకితం)

4 కామెంట్‌లు: